calender_icon.png 27 October, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండాముంచిన పత్తి సాగు

27-10-2025 12:12:55 AM

  1. తెల్ల బంగారనికి ఎర్ర తెగుళ్ళు

రైతుల ఆశలు ఆవిరి

అధిక వర్షాలే నష్టానికి కారణం

పత్తి విక్రయానికి దళారులే దిక్కు

బెజ్జంకి, అక్టోబర్ 26: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పత్తి పంట సాగు రైతులను నిండముంచింది. పంట చేతికందుతున్న స మయంలో కురిసిన వర్షాలు పూత, కాయ రాలిపోవడానికి కారణమయ్యాయి. దీంతో కాయలు సరిగా విచ్చుకోలేదు. పొలాల్లో నీ రు నిలిచి పంట దెబ్బతింది. పత్తి పంట సా గుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు ని రాశే మిగులుతుంది. 

ఊహించని విధంగా ప్రకృతి కన్నెర్ర చేయడంతో తెల్లబంగారంతో నష్టాలు కలుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి పత్తికి ధర అధికంగా ఉన్నప్పటికీ ఆశించినంతగా దిగుబడి లేక పెట్టుబడులైనా వస్తాయో లేదోనని బా ధ పడుతున్నారు. వేల ఎకరాల్లో రైతులు ప త్తి పంట సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

జిల్లాలో కొన్ని మండలాల్లో అధికంగా నల్లరేగడి భూములు ఉండటంతో పాటు గతేడాది ఆశించిన దిగుబడి రాకపోవడంతో ఈసారి రైతులు పత్తి సాగుపై గంపెడాశాలు పెట్టుకున్నారు. పంట ఏపుగా పెరిగి కాయ పట్టే సమయంలో అధి క వర్షాలతో పంట ఎదుగుదల్లేక ఎర్ర తెగుళ్ల బారిన పడి దిగుబడి తగ్గిపోయిందని రైతు లు వాపోతున్నారు.

గత ఏడాది ఎకరాకు 10 క్వింటాళ్లకు పైగా దిగుబడి రాగా, ఈసారి ఎకరాకు 5 క్వింటాళ్లు దిగుబడి వచ్చే పరిస్థితిలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో పత్తి పంటకు ధర ఉన్న పంట ది గుబడి లేకుండా పోయి పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పత్తి పంట సాగుకు ఎకరాకు రూ.20 వేలకు పైగా పెట్టుబడులు పెట్టీ కౌ లు తీసుకొని పంటలు సాగుచేసిన తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని రైతులు మదనపడుతున్నారు. గత రెండేళ్ల క్రితం పత్తి పంటకు గులాబి రంగు పురుగు సోకి నష్టాల పాలు చేయగా ఈసారి అధిక వర్షాభావం తో ఇప్పట్టికే ఎర్ర పురుగు వైరస్ సోకి దిగుబడి తగ్గిపోయే దుస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పంట బీమా అమలు చేసి రైతులను అదుకోవాల ని విజ్ఞప్తి చేస్తున్నారు.

దోపిడికి గురవుతున్న రైతులు 

వానాకాల సీజన్లో అకాల వర్షం వల్ల పత్తి పంట పూర్తిగా నష్టపోవడం జరిగింది. పత్తిని తీసి మిల్లర్ల దగ్గరకి వెళ్తే  కాయ, తేమ పేరు తో రూ.4 వేలకు క్వింటాలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో మిల్లు యాజ మాన్యం రైతులను నిలువ దోపిడీ చేస్తున్నా రు. ప్రభుత్వం మద్దత్తు ధర రూ.8వేల 110  ప్రకటించింది.

కానీ పత్తి కొనుగోలు వ్యాపారులు మాత్రం సీసీఐ నిబంధనలు పట్టించి కోకుండా రైతుల కష్టాలను దోచుకుంటున్నా రు. ప్రభుత్వం స్పందించి జిల్లా వ్యాప్తంగా అవసరమైనచోట్ల సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి పంట రైతులను మద్దతు ధర పెంచి ఆదుకోవాలని కోరుతున్నారు.

కౌలు నష్టం వాటిల్లింది... 

వ్యవసాయం మీద ఉన్న మక్కువతో భూమి కౌలు కు తీసుకుంటే న ష్టం వాటిల్లింది. భూ యజమానులకు నగదు చెల్లించి, పెట్టుబడికి అప్పు చేయాల్సి వస్తుంది. ప్రకృతి వైపరీత్యంగా పంట చేతికొచ్చిన సమయానికి వర్షాలు కురవడంతో ది గుబడి లేకుండాపోయింది.

ఈసారి యూరియా బస్తాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాం, సరైన సమయానికి అవ సరమైనంత ఎరువులు దొరకలేదు. ఈ సారి పంట కోసం చేసిన అప్పుకుడ తీరే ట్టు లేదు. కౌలు పైసలు కూడా వచ్చేలా లేవు, పంట బీమాను ప్రభుత్వం అమలు చేసి రైతులను ఆదుకోవాలి

చింతపల్లి రవీందర్ రెడ్డి, రైతు, కల్లిపెల్లి

నీరు నిలిచిన పంటల్లో ఎర్ర పురుగు

వర్షం నీరు పత్తి పంటలో నిలిచి ఉం డటం వల్లఎర్రపు రుగు ఆశించే అవకాశాలుంటాయి. మోనోక్రోటోఫోస్ 1.6 మిల్లి లీటర్ ఒక లీటర్ నీరు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లి లీటర్ లేదా థయా మితక్సమ్ 0.2 గ్రా. లీటర్ నీటిలో తగు మోతాదులో కలిపి పిచికారీ చేయాలి.

సంతోష్, ఏఓ బెజ్జంకి

లక్షల్లో పెట్టుబడి..దిగుబడి అంతంతే

ఇటీవల కురిసి న అధిక వర్షాల వ ల్ల పత్తి పంట సాగు ఆశించినదిగుబడి రావడం కష్టమే. మూ డేకరాల స్వంత  భూమితో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాను. రూ.లక్షలు కౌలు చెల్లించి పెట్టుబడి పెట్టి పదేకరాల్లో పత్తి పంట సాగుచేశాను.

లక్షల్లో పెట్టుబడులే తప్ప, పంట దిగుబడి అంతంత మాత్ర మే. పత్తి పంటకు ఎర్ర తెగుళ్లు సోకి ఆ శించిన దిగుబడి రావడం కష్టమే ప్రభు త్వం పత్తి రైతులను అదూకూనేల ప్రత్యే క చొరవ చూపి పరిహారం అందించాలి.

బోనగిరి గుండయ్య, రైతు బెజ్జంకి.