calender_icon.png 27 October, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నాం

27-10-2025 12:13:39 AM

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి):  మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ విద్యాసంస్థలలో కార్పోరేట్ స్థాయి విద్య అందుబాటులోకి వచ్చింది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు పేర్కొన్నారు.  మహబూబ్ నగర్ నగరం, వ డ్డెర బస్తీ లోని ప్రైవేట్ ఎలక్రికల్ టెక్నీషియన్స్ భవనంలో ప్రైవేటు ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్, ప్రై వేటు ఎలక్ట్రికల్ షాప్స్ యాజమానుల అవగాహన సదస్సు నిర్వహించారు.

అవగాహన సదస్సు కు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ అన్నింట్లో ఫస్ట్ ఉండాలంటే విద్య, వైద్యం లో మనం ముందుండాలని అన్నారు. అందుకే తాను విద్య , వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను అని తెలిపారు. ఆర్థికంగా బలంగా లేనివారు ప్రభుత్వ విద్యాసంస్థలలో మీ పిల్లలను చేర్పించాలని వారికి మంచి విద్యను అందించే బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు.

ఏ ఆపద ఎ క్కడినుంచి వస్తుందో తెలియదు కాబట్టి ఆపద సమయంలో మనకు అండగా ఉండే మెడికల్ ఇ న్సూరెన్స్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన సూచించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు పథకం ప్రజలను మభ్య పెట్టే పథకమని ఆయన ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆయన చెప్పారు. 

హోల్ సేల్ యాజమాన్యంతో మాట్లాడి కొత్తగా రిటేల్ షాపులు పెట్టకుండా కట్టడి చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ , మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, అజ్మత్ అలి, మైత్రి యాదయ్య, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అంజద్ ప్రైవేటు ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ నాయకులు వి.వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు.