27-10-2025 12:14:53 AM
మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 26: ఎన్ హెచ్ 167 రోడ్డు మార్గం మధ్యలో నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగించడంతో ప్రమాదాలకు బారిన పడుతున్నారని ఎమ్మార్పీఎస్ సౌత్ రాష్ట్ర అధ్యక్షులు మల్లెపువ్వు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని కాలనీవాసులు అతని దృష్టికి తీసుకురావడంతో సొంత ఖర్చులతో మార్గ మధ్యలో ఉన్న ప్రహారికి ప్రజలు రాకపోగలు ఎక్కడపడితే అక్కడ కొనసాగించకుండా వెల్డింగ్ చేయించారు. కేవలం యూటర్న్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే రాకపోకలు కొనసాగించాలని సూచించారు. మల్లెపువ్వు శ్రీనివాస్ చేసిన పని పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.