calender_icon.png 27 October, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సెట్విన్ చైర్మన్

27-10-2025 12:15:07 AM

జహీరాబాద్, అక్టోబర్ 26 : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం జూబ్లీహి ల్స్ వివిధ ప్రాంతాలలో ఆయన కార్యకర్తలతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.

ఇతర పార్టీలు ఎన్ని కుయుక్తులు చేసినా గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని జోస్యం చెప్పారు. మహిళలకు ఇస్తున్న ఉచిత బస్సు సౌకర్యం, హైదరాబాదులోని వివిధ ప్రాంతాలలో గల మహిళలు ఎంతగానో .ఉపయోగించుకుంటున్నారని మహిళలు అందరు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు నవీ న్ కుమార్ ,నాయకులు పాల్గొన్నారు.