28-11-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, నవంబర్ 27 (విజయక్రాంతి) : నూతన సంవత్సరం వేడుకలు సమీపిస్తున్న వేళ హైటెక్ హబ్ మాదాప్పూ డ్రగ్ మాఫియాలు కన్నేశాయి. పబ్ ఇతర పార్టీలలో డిమాండ్ పెరగడంతో ఎండీఎంఏ సరఫరా చేసేందుకు సిద్ధమైన ఇద్దరిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు ముందస్తు సమాచారం ఆధారంగా ముట్టడించింది. బెం గళూరు గోవా లింక్లను ఉపయోగించి చిన్న ప్యాకెట్ల రూపంలో ఎండీఎంఏను నగరానికి తెప్పించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
న్యూ ఇయర్ ఈవ్ పార్టీలకు అధిక ధరలకు విక్రయించాలనే ఉద్దేశంతో మాదాపూర్ పరిధిలో కస్టమర్లతో కాంటాక్టులు పెంచుతున్న సమయంలోనే పోలీసు లు వలవేసి అరెస్టు చేశారు.ఈ రైడ్లో 14 గ్రాముల ఎండీఎంఏ, డీలింగ్కు వాడిన రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఫోన్లలో దొరికిన చాట్ హిస్టరీ, పేమెం ట్ రికార్డులు, లొకేషన్ డ్రాప్ ప్లాన్స్ను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
నిందితులు సాధార ణంగా ఓయో రూములు, అద్దె ఫ్లా ట్లు, నిర్జన ప్రాంతాలను డ్రాప్ పా యింట్లుగా వాడు తూ ‘రోడ్ పికప్’, ‘లోకేషన్ హాప్’ మోడ్లో సరఫరా చేస్తున్నట్టు ఎస్వోటీ గుర్తించింది. వీరిద్దరూ కేవలం చివరి దశ సరఫరాదారులేనన్న అనుమానంతో ప్రధా న ఏజెం ట్లు ఎవరు, స్టాక్ ఎక్కడ నిల్వ అవుతోంది, గత కొన్ని నెలల్లో ఎన్ని రవాణాలు జరిగాయనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది. పార్టీ సీజన్ను క్యాష్ చేసుకునే డ్రగ్స్ మాఫియాల కదలికలను అడ్డుకునేందుకు మాదాపూర్ హైటెక్ ప్రాంతాల్లో నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమో దు చేసి రిమాండ్‌కు తరలించారు.