16-11-2025 12:28:52 AM
రూ.వెయ్యి కోట్ల అంచనా వ్యయం ఖర్చుపై చర్చ
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): ఉస్మానియా యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, ఓయూను ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.వెయ్యి కోట్ల అంచనా వ్యయంతో శనివారం హైపవర్ కమిటీ భేటీ అయ్యింది. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులతోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారు లు హాజరై వర్సిటీ అభివృద్ధిపై చర్చించారు.
ఐఎస్‌బీ, ఐఐటీ హైదరాబాద్ విద్యాసంస్థల్లో చేసిన క్షేత్ర పర్యటనలకు సంబంధించి, వాటిలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, విద్యాప్రమాణాలు, పలు ప్రతిపాద నలపై చర్చించారు. ఓయూను ఉన్నత విద్య, విద్యా పరిశోధనలో వరల్డ్ క్లాస్ క్యాంపస్‌గా ఏవిధంగా తీర్చిదిద్దాలనే అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
గతంలో ఓయూ పర్యటనలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా వర్సిటీని వరల్డ్ క్లాస్ వర్సి టీగా అభివృద్ధి చేయాలని, అందుకు రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లోగా ఓ నివేదికను రూపొందించి వర్సిటీకు ఏం కావా లో చెప్పాలని ఆదేశించిన నేపథ్యంలోనే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సమావేశమయ్యారు.