హిందీ టీచర్ సదాలక్ష్మికి డాక్టరేట్
అభినందించిన కలెక్టర్
జగిత్యాల, జూన్ 11 (విజయ క్రాంతి ): సామాజిక సేవ చేస్తున్న హిందీ టీచర్ సదాలక్ష్మిని డాక్టరేట్ వరించింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అనంతల సదాలక్ష్మి(తాటికొండ లక్ష్మీనాగ) సామాజిక సేవారంగంలో ముందుకు సాగుతున్నారు. ఆమె సేవలను గుర్తించిన వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను అందజే సింది.
ఢిల్లీలోని హోటల్ సరోవర్‌లో ఈ నెల 8న వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిరహించిన ఎల్లో ఎచీవర్స్‌లో భాగంగా సదాలక్ష్మికి డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. సదాలక్ష్మిని మంగళవారం జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా విద్యాధికారి బి.జగన్మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు యాల్ల అమర్నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనందరావ్ అభినందించారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సదాలక్ష్మి మాట్లాడుతూ.. డాక్టరేట్ తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.






