09-05-2025 02:00:52 AM
స్పెషల్ ఫోకస్ పెట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్
-కరీంనగర్, మే 8 (విజయ క్రాంతి): ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సంద ర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ ఏక్తాయాత్ర ఈ నెల 22న నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో కేంద్రం ఉగ్ర మూకలను ముట్టు పెడుతున్న సందర్భంలో యావత్ దేశం జేంద్రనికి అండగా నిలిచింది. హిందుత్వ ఎజెండాను భుజాన వేసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజాయ్ యాత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టి బీజేపీ శ్రేణులకు యాత్ర నిర్వహణ కోసం దిశానిర్దేశనం చేశారు.
పలు కుల, ఆధ్యాత్మిక, సేవా సంఘాలను యాత్రలో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు కుల, ఆధ్యాత్మిక, సేవా సంఘాలు హిందూ ఏక్తాయాత్రకు సంఘీభావం తెలిపి యాత్ర లో భాగస్వాములవుతామని ప్రకటిం చాయి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే లక్ష మందికి తక్కువ కాకుండా హిందువులు హాజరయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే నియోజకవర్గాలు, మండలాల వారీగా సన్నాహాక సమావేశాలు, పోలింగ్ బూత్ వారీగా సమావేశాలు నిర్వహించి ప్రతి ఒక్కరూ యాత్రకు తరలివచ్చేలా బీజేపీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్న హిందువులు సైతం ఈ యాత్రలో పాల్గొని ఐక్యత చాటి చెప్పేందుకు బండి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ హిందూ ఏక్తాయాత్రలో హనుమాన్ దీక్షాపరులు అధికసంఖ్యలో పాల్గొనను న్నారు. ఈ యాత్రనగరంలోని ప్రధాన రహ దారుల గుండా సాగనుంది. ఈ యాత్రలో భారీ శ్రీరామ, హనుమాన్ విగ్రహాలు ప్రధాన ఆకర్షణగా నిలవను న్నాయి. అలాగే వివిధ కళారూపాలు ప్రదర్శిస్తూ కళాకారులు కనువిందుచేయనున్నారు.
ఈ యాత్ర సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యూహరచన చేస్తున్నారు. ఈ యాత్రను పెద్ద ఎత్తున నిర్వహించి అన్ని హిందూ ఏక్తా యాత్రలకు స్ఫూర్తిగా నిలిపేం దుకు కృషి చేస్తున్నారు. హిందువులంతా హాజరై ఐక్యతను ప్రదర్శించి సత్తాను చాటా ల్సిన సమయం ఆసన్న మైందని, అందరు హిందూ ఏక్తా యాత్రలో పాల్గొని విజయ వంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.