calender_icon.png 29 May, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుకున్న సమయానికే రైతుభరోసా నిధులు వేస్తాం: మంత్రి తుమ్మల

28-05-2025 01:25:47 PM

రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నది

హైదరాబాద్: రైతుకు మంచి రోజులు వస్తున్నాయని, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) అన్నారు. ఆర్థిక సమస్యలను అధిగమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) రుణమాఫీ చేశారని మంత్రి తుమ్మల గుర్తుచేశారు. గతేడాది మొదటిపంట కాలంలోనే రైతుల ఖాతాల్లో రూ. 33 వేల కోట్లు వేశారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక ధాన్యం సేకరించిన రాష్ట్రం తెలంగాణ అని తుమ్మల వెల్లడించారు. అనుకున్న సమయానికే రైతుభరోసా నిధులు వేస్తామని తుమ్మల నాగేశ్వర రావు హామీ ఇచ్చారు. అతి త్వరలోనే నల్గొండ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు.