calender_icon.png 29 May, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేశనపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మెడికల్ క్యాంప్

28-05-2025 01:46:47 PM

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం

ముత్తారం, (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో బుధవారం రాష్ట్ర  ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆదేశాల మేరకు కరీంనగర్ లోని సన్ రైస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, ముత్తారం మండల మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని సదానందం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ క్యాంపులో కేశనపల్లి గ్రామస్తులు 500 పై మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకోగా వారికి ఉచిత మందులు అందచేశామని సదానందం తెలిపారు.  ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్, గ్రామ శాఖ అధ్యక్షులు పెగడ కుమార్, గ్రామ యూత్ అధ్యక్షులు నవీన్, సన్ రైస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రక్షిత, క్యాంప్ మేనేజర్ రాజేందర్, కోఆర్డినేటర్ సతీష్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తిరుపతి, సన్రైజ్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.