09-05-2025 01:54:47 AM
ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు
మహబూబాబాద్, మే 8 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ మేరకు గురువారం మహబూబాబాద్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎమ్మెల్సీ మాట్లాడారు.
వర్షాకాలం ప్రారంభానికి నెల రోజులు మాత్రమే గడువు ఉన్నందున తెగిపోయిన చెరువులు, కుంటలకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు ఏ పట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాలయాపన చేస్తే వచ్చే వర్షాకాలంలో రైతులకు సాగునీటికీ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.
ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, మాజీ కౌన్సిలర్ ఎడ్ల వేణు మాధవ్, బి ఆర్ ఎస్ నాయకులు మంగళంపల్లి కన్నా, జర్రిపోతుల వెంకన్న గౌడ్, కర్పూరపు గోపి తదితరులు పాల్గొన్నారు.