26-09-2025 06:06:09 PM
తాండూరు,(విజయక్రాంతి): వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట పటిపను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సన్మార్గం లో నడుచుకొని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు.