13-03-2025 02:40:27 PM
-జహీరాబాద్ లో వివిధ మతాల పెద్దలతో పోలీసుల సమావేశం..
-జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి
సంగారెడ్డి, (విజయక్రాంతి): హోలీ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఇలాంటి ఘర్షణలకు చోటు లేకుండా చూడాలని వివిధ మతాల పెద్దలకు జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి సూచించారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్టణంలోని వివిధ మతాలకు చెందిన కుల పెద్దలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. హోలీ వేడుకల్లో ఎవరి మతానికి ఇబ్బంది లేకుండా పండగ జరుపుకోవాలన్నారు. సహజ సిద్ధమైన రంగులు చల్లుకోవాలని, రసాయన రంగులతో ఆరోగ్యాలు పాడు చేసుకోరాదు అన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ పట్టణ సిఐ శివలింగం, కోటనే ఎస్ఐ కాశీనాథ్, కోహీర్ ఎస్సై సతీష్ తోపాటు వివిధ మతాలు పెద్దలు పాల్గొన్నారు.