calender_icon.png 29 August, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంగునూర్‌లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి పర్యటన: పార్టీ బలోపేతంపై దృష్టి

29-08-2025 01:28:25 AM

నంగునూర్, ఆగస్టు 28: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మె ల్సీ అంజిరెడ్డి సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలంలో గురువారం పర్యటించి పలు కార్యక్రమాలలో పా ల్గొన్నారు. పర్యటనలో ఆయన ప్రధానంగా పార్టీ కార్యకర్తలతో సమా వేశమయ్యారు. స్థానిక ఎన్నికలే లక్ష్యం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన అంజిరెడ్డి, పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చే యాలని పిలుపునిచ్చారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.నంగునూర్ లోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ఇటీవల మరణించిన ఖానాపూర్ మాజీ సర్పంచ్ కే.సి.రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ పర్యటనలో మండల బీజేపీ అధ్యక్షులు చౌడుచర్ల వెంకట్రాం రెడ్డి, సీనియర్ నాయకులు రజినికర్ రెడ్డి, రాంచంద్ర రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పప్పు సురేందర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.