29-08-2025 01:26:11 AM
చేగుంట ఆగస్టు 28 (విజయక్రాంతి): ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా చేగుంట మండలంలో పలు గ్రామాలలో తీవ్రనష్టం జరిగింది. మండలంలో పలు గ్రామాలలో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో మండలంలో దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ సి.హెచ్ శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో చిన్నారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జై భరత్ రెడ్డి, సర్వేయర్, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాలో వర్షానికి దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు.
ఇబ్రహీంపూర్ లో రోడ్లు కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. చందాయిపేట్, పొలంపల్లి పరీవాహక ప్రాంతంలోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములు నీట మునిగాయి. వరి, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పం ట నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు తలలు పట్టుకుంటున్నారు.
అధికారులు తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు ఆర్థిక సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, విజయపాల్ రెడ్డి, కొండి శ్రీనివాస్, స్టాలిన్ నర్సిములు, కాషాబోయిన భాస్కర్, సండ్రు శ్రీకాంత్, అయిత పరంజ్యోతి, సాయికుమార్ గౌడ్,ఆ గమయ్య, రాజు పాల్గొన్నారు.