calender_icon.png 29 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్ జలదిగ్బంధానికి ప్రతాప్ రెడ్డి, నర్సారెడ్డిలే కారణం

29-08-2025 01:24:22 AM

- కబ్జాలు, అక్రమా వెంచర్లు, ఆ ఇద్దరికే సాధ్యం

బీజేపీ నాయకులు ఆరోపణ

గజ్వేల్, ఆగస్టు 28: గజ్వేల్ పట్టణంలోని అనేక నివాసాలు జలదిగ్బంధానికి గురికావడానికి నర్సారెడ్డి, ప్రతాపరెడ్డి లు చేసిన కబ్జాలు, అక్రమ వెంచర్లే కారణమని బిజెపి నాయకులు ఆరోపించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తూప్రాన్ రోడ్లో సబ్ స్టేషన్ తో పాటు ఇతర ప్రాంతాలు, ప్రజ్ఞాపూర్ ఊర చెరువు ప్రాంతంలో పెట్రోల్ బంకులు,  దుకాణాలు జలమయం కావడానికి  బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు నర్సారెడ్డి, ప్రతాపరెడ్డిలే ప్రధాన కారణమని గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, నాగు ముదిరాజ్ ఆరోపించారు.

గజ్వేల్ లో జలమయమైన ప్రాంతాలను వారు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ప్రజ్ఞాపూర్ చెరువు కింద సర్వే నెంబర్ 437 లో తూము నుండి వచ్చే కాలువ మొత్తం మూసేసి పెద్ద స్థాయిలో వెంచర్ చేయడమే ఈ ముంపుకు కారణమైందన్నారు.

తూప్రాన్ మార్గంలో 597 సర్వే నెంబర్లు నల్లాల బావి కబ్జా చేసి ఎర్రకుంట నుండి వచ్చే నీటికి అడ్డుగా భవనాలు నిర్మించడంతో ఆ ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయని ఆరోపించారు. ఇవన్నీ గత 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆరోపించారు. ప్రతాప్ రెడ్డి నర్సారెడ్డి వారి ప్రభుత్వ అధికార అండదండలతోనే చేసిన అక్రమాల వల్ల గజ్వేల్ పట్టణం ముంపుకు గురవుతుందన్నారు.