17-01-2026 12:38:57 AM
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
కేసముద్రం, జనవరి 16 (విజయక్రాంతి): నిజాయితీ మనిషి జీవితాన్ని నిలబెడుతుందని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిజాయితీతో జీవించడం అలవర్చుకోవాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. కేసముద్రం పట్టణంలో మహిళలకు గత 37 సంవత్సరాలుగా ముగ్గుల పోటీ నిర్వహిస్తూ మహిళల్ని కళాకారులుగా తీర్చిదిద్దడం హర్షనీయమని పేర్కొన్నారు. సంక్రాంతి ముగ్గుల పోటీ ’బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పండగలు మన సంస్కృతికి నిదర్శనమని, పండగల విశిష్టతను భావితరాలకు అందించే విధంగా కృషి చేయడం హర్షనీయమన్నారు.
మహబూబాబాద్ జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు వినియోగదారుల హక్కుల గురించి వివరించారు. అనంతరం ముఖ్య అతిధులు గుమ్మడి నరసయ్య, డాక్టర్ అల్లం రమ నాగేశ్వరరావు, మైస శ్రీనివాసులచే ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నటరాజ కళానికేతన్ అధ్యక్షులు చీకటి వెంకట్రాo నరసయ్య, కోశాధికారి కుర్న హరినాథ్, ఉపాధ్యక్షులు నాగనబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.