05-11-2025 12:00:00 AM
కొత్త రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే లు, ఫ్లుఓవర్ల నిర్మాణాలతో మ న దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుం ది. రోడ్లపై ప్రయాణించే వాహనాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఇవాళ వా హనాల వేగం ఆధునికతలో బాగమయిం ది. కానీ ఈ ప్రగతి వెనుక ఒక భయంకరమైన వాస్తవం దాగుంది. ప్రతీ ఉదయం పత్రికలు తెరిస్తే మన కళ్ళకు మొదట తగిలేది వార్త కాదు రోడ్డు ప్రమాదాల వేదన భరిత దృశ్యం.
ప్రతి ప్రమాదం వెనుక చిద్రమవుతున్న ఓ కుటుంబం, మసకబారుతున్న ఓ భవిష్యత్తు. ప్రగతికి మార్గాలు కావాల్సిన హైవేలు ఇవాళ మృత్యు మా ర్గాలుగా ఎందుకు మారుతున్నాయి? రో డ్డు ప్రమాదం అనేది ఒక్క క్షణికావేశ సం ఘటన ఎంతమాత్రం కాదు, అది సమా జం మొత్తం కలిపి చేసిన నిర్లక్ష్య ప్రతిబిం బం లాంటిది. మన దేశంలో రహదారుల సంఖ్య పెరుగుతుండడం మెచ్చుకోవాల్సిన అంశమే అయినప్పటికీ వాటి నిర్మాణాల్లో నాణ్యత తగ్గుతుండడం ఆందోళన కలిగించే అంశం. బోర్డులు లేని మలుపులు, లైట్లు లేని వీధులు, గోతులతో నిండిన దా రులు..
ఇవే మన జీవన మార్గాల రూపం. నేడు రహదారి నిర్మాణం పాలకుల ఆజ్ఞ లో కాంట్రాక్టర్లకు లాభాల వేదికగా మారిపోయింది. ప్రతి కిలోమీటర్ రోడ్డుకి ఖర్చ యిన కోట్ల రూపాయల్లో వెయ్యో వంతు కూడా భద్రత కోసం ఖర్చు చేయడం లే దు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి ప్రతీక. గ మ్యం దగ్గర చేసే కొత్త హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై సమాజం వేగాన్ని అభివృద్ధిగా చూ స్తుంటే జీవితం దూరమవుతోంది.
ఇది ప్ర భుత్వ బాధ్యతే కాదు ప్రజా నిర్లక్ష్యం కూడా. మనం వాహనం నడిపేటప్పుడు మన ప్రా ణం మాత్రమే కాదు, ఇతరుల ప్రాణాల పట్ల కూడా బాధ్యత వహించాలన్న కనీస ధర్మం పాటించాల్సిన అవసరముంది. కానీ ఏ ఒక్కరిలోనూ కనీస అవగాహన కనిపించడం లేదు.
వేగం మనలో ఉన్న మానసిక వ్యాధి. రోడ్డు నిబంధనలను పాటించకుండా వాహనాలు ఇష్టారీతిన నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపడం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇవన్నీ కలిసి ఇవాళ రహదారులను రక్తసిక్తంగా మార్చేస్తున్నా యి. చట్టం పట్ల భయం, గౌరవం, భాద్యత అనేది ఏ కోశానా కనిపించడం లేదు. ఇది సమాజంలో చైతన్య లోపం, విలువలను హాస్యంగా పరిగణించడం కిందకే వస్తుంది.
అన్నింటా నిర్లక్ష్యం
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జాతీయ రహదారిపై సోమ వారం వేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బ స్సును ఢీకొట్టిన ఘటన ఈ కోవలోకే వ స్తుంది. ఇక్కడ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, ర హదారి సరిగా లేకపోవడం, జాతీయ రహదారి అయి ఉండి కూడా ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్పడడం చూస్తే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుం ది. 24 ఏళ్ల టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ తనతో పాటు 19 మందిని బలి తీసుకుంది.
అతను మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనేది తెలియా ల్సి ఉన్నప్పటికీ కంకరను ఓవర్ లోడ్‌తో తీసుకురావడమే గాక అధిక స్పీడ్‌తో వా హనం నడిపినట్లు బస్సును ఢీకొట్టిన విధానమే చూపిస్తుంది. గుంత ఉందన్న నెపం తో దాని నుంచి టిప్పర్‌ను తప్పించాలనే ఉద్దేశంతో కుడివైపుకు తిప్పాడు. అప్పటికే వేగంతో ఉన్న వాహనం కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
అయితే ఇక్కడ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లే టిప్పర్‌ను కుడివైపునకు కాకుండా ఎడమవైపునకు తిప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉం డేదేమో. పోలీసుల కొరతతో ట్రాఫిక్ ని యంత్రణ వ్యవస్థ కూడా క్రమంగా బలహీనమవుతూ వస్తుంది. పోలీసులు ఫైన్ల పేరు తో వసూళ్లకు పాల్పడుతుండడంతో అవినీతి పేరుకుపోయి ప్రజల్లో చట్టం పట్ల ఉ న్న గౌరవాన్ని తగ్గిస్తున్నాయి. డ్రైవింగ్ లైసె న్స్ పొందడం బాధ్యతగా కాక లంచాల బాటలో సులభ ప్రక్రియగా మారిపోయింది.
ఫిట్‌నెస్ లేని వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. చట్టం ఉన్నా అమలు కాకపోవడమనేది మన చట్టంలో ఉన్న అవగాహన రాహిత్యమని చెప్పొచ్చు. ఇవా ళ మనందరం వాహనాలను బాధ్యతతో కాకుండా వేగంగా, మూర్ఖంగా నడపడం నేర్చుకుంటున్నాం. ఇవే ఇవాళ రోడ్డు ప్ర మాదాలకు కారణమవుతున్నాయి.
గోల్డెన్ అవర్‌కు మచ్చ
ప్రభుత్వాలు స్మార్ట్ హైవేలు కడుతున్నప్పటికీ స్మార్ట్ డ్రైవింగ్ విషయంలో చైత న్యం కలిగించడంలో విఫలమవుతూనే ఉ న్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత తొలి పది నిమిషాలు గోల్డెన్ అవర్ అని వైద్యు లు చెప్పడం చూస్తుంటాం. కానీ మన దేశ హైవేల పక్కన అత్యవసర వైద్య కేంద్రాలు లేక ఆ పది నిమిషాలే ఇవాళ ప్రాణాలు తీస్తున్నాయి. అంబులెన్స్ సౌకర్యాలు ఉ న్నా నరకప్రాయమైన ట్రాఫిక్‌లో చిక్కుకొని సకాలంలో చేరుకోకపోవడంతో రో జుకు కొన్ని వందల మంది ప్రాణాలు గా ల్లో కలుస్తున్నాయి.
ఆసుపత్రికి తీసుకెళ్లినా మొదట కేసు నమోదు, ఫీజు చెల్లింపు అనే విధానాలు ప్రాణానికి అడ్డుకట్ట వేస్తున్నా యి. ప్రాణం కన్నా ఫార్మాలిటీ ముఖ్యమా అనేది ఆలోచించాలి. మోటార్ చట్టం కఠినతరమై జరిమానాలు పెరిగినా అమలు మాత్రం బలహీనంగా ఉంది. ప్రభుత్వం చట్టాలను రూపొందించడం మాత్రమే కా దు, వాటిని పర్యవేక్షించాలి. ఈ వ్యవస్థ మారాలంటే, ప్రజల మనస్తత్వం మారా లి. మద్యం సేవించి వాహనం నడపడం కేవలం చట్టాన్ని ఉల్లంఘించడమే కాదు, హత్యాయత్నం చేయడం కిందకు వస్తుంది.
మీడియా చైత్యన్యం
ప్రజాస్వామ్యంలో మీడియాను నాలు గో స్తంభంగా పేర్కొంటారు. అంతటి ప్రా ముఖ్యత కలిగిన మీడియా ఇవాళ రోడ్డు ప్రమాదాలు జరిగితే తమ టీఆర్పీని పెం చుకునేందుకు రోడ్డు ప్రమాద దృశ్యాలను ఏఐతో రూపొందించడం, విలపించే కు టుంబాల వీడియోలు పదే పదే ప్రసారం చేస్తున్నాయి. అందునా సోషల్ మీడియా ప్రభావం పుణ్యానా మీడియాకు ఉన్న మంచి పేరు కూడా పోతుందనడంలో సం దేహం లేదు.
రాజకీయ ర్యాలీలపై మూడు గంటలు కేటాయించే మీడియా.. భద్రతా అంశంపై కనీసం మూడు నిమిషాలు కూ డా సమయం కేటాయించదు. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేయడంతో పాటు రహదారుల డిజైన్ నిర్మాణాల లోపాలను ప్రశ్నించేలా పనిచేయాల్సిన అవసరముం ది. ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి ప్రతి ఛానెల్, యూట్యూబ్, ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌లు.. రోజులో కనీసం ఐదు నిమిషాలు సురక్షిత డ్రైవింగ్, హెల్మెట్‌పై అవ గాహన, సీటు బెల్ట్ ప్రాముఖ్యత వంటి చిన్న చిన్న వీడియో, ఆడియో క్లిప్స్ ప్రసా రం చేయడం విధిగా చేయాలి.
ప్రతి పత్రిక ప్రమాదం గురించి బాధతో చుట్టిన కథ నం కాకుండా పరిష్కార మార్గాలను సూ చించే రిపోర్టులు ఇవ్వాల్సిన అవసరముం ది. ప్రభుత్వం మీడియా ద్వారా ట్రాఫిక్ ని బంధనలకు సంబంధించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి. ప్రజాస్వామ్య రక్షణకు, ప్రజా అవగాహనకు మీడియా జీవనరేఖ గా నిలబడాలి. రోడ్డు నియమాలపై, ప్ర మాద నివారణ చిట్కాలపై, చట్టాలపై ప్రజ ల్లో అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల యువతను చైతన్యవంతులను చేయాలి.
భద్రతే ప్రామాణికం
మన హైవేలు ప్రగతి చిహ్నాలుగా మా రాలి కానీ సమాధులుగా కాదు. ప్రభుత్వం కూడా మీడియా సంస్థలను ఈ విషయం లో భాగస్వామ్యం చేయాలి. రోడ్డు భద్రతా ప్రచారం కోసం ప్రత్యేక మీడియా అవార్డు లు, పన్ను మినహాయింపులు ఇవ్వాలి. ఇది కేవలం ప్రచారం కాదు, ప్రాణ రక్షణ కార్యక్రమం. చిత్తశుద్ధితో ముందుకొస్తే, ప్రతి పౌ రుడి మనసులో రోడ్డు మీద వేగం కాదు, జీవితం ముఖ్యమనే సందేశం చెరగని ము ద్ర వేస్తుంది.
పాఠశాల విద్యా వ్యవస్థ నుం చే మార్పు మొదలవ్వాలి. పాఠశాలల్లో రో డ్డు భద్రత పాఠ్యాంశాన్ని బలమైన అంశాలతో చేర్చాలి. యువత డ్రైవింగ్‌ను నిర్ల క్ష్యంగా గాక బాధ్యతగా నేర్చుకోవాలి. వాహనం చేతిలో పట్టుకున్నవాడు ఆయు ధం పట్టుకున్నవాడిలా జాగ్రత్తగా ఉండాలని నేర్పించాలి. ప్రభుత్వం, ప్రసార మా ధ్యమాలు ప్రజలు కలిసి ప్రమాదరహిత ప్రయాణం కోసం ప్రయత్నించాలి.