29-09-2025 12:07:36 AM
అభినందించిన వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు
హైదరాబాద్, సెప్టెంబర్ 28(విజయక్రాం తి): వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కాటన్ సెక్షన్ సభ్యుడు ఐతు వీరేష్ (నాగేంద్ర కాటన్ ట్రేడర్స్ యజమాని, సత్యనారాయణ స్వామి కొటెక్స్ భాగస్వామి) కుమారుడు ఐతు నితీష్ గ్రూప్-1 ద్వారా డిప్యూటీ కలెక్టర్‌గా మహబూబాబాద్ జిల్లాకు నియమితులయారు.
ఈ సందర్భంగా ఆదివారం చాంబర్ కార్యాలయంలో నితీష్‌ను పలువురు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మడూరి వేద ప్రకాష్ , ఉపాధ్యక్షులు శ్రీ మొగిలి చంద్రమౌళి,కోశాధికారి అల్లే సంపత్, చాంబర్ కార్యవర్గ సభ్యులు, అన్ని సెక్షన్ల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ఛాంబర్ సభ్యు లు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రు లు పాల్గొని డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులైన నితీష్‌ను అభినందించారు.