29-09-2025 12:09:08 AM
-పాల్గొన్న యాజమాన్యం, డాక్టర్లు, సిబ్బంది
-ప్రజలకు పండుగల శుభాకాంక్షలు చెప్పిన వ్యవస్థాపక చైర్మన్
హైదరాబాద్ సిటిబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ నానక్ రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో బతుకమ్మ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో హాస్పిటల్ యాజమాన్యంతో పాటు డాక్టర్లు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి.. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ ఆటలాడు తూ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగను ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పండుగలన్నా పూవులను పూజించే పండుగ ఒక్క మన తెలంగాణ బతుకమ్మ పండుగకే సొంతం అన్నారు. ప్రజలందరికీ ఆయన బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు.