29-09-2025 12:06:49 AM
ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్ ప్రకటన చూసిన నాయకులకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది
ఏటూరునాగారం, కన్నాయిగూడెం, సెప్టెంబరు28 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఉన్న అన్ని మండలాల్లో ఉన్న పలు రాజకీయ పార్టీల నాయకులు నిన్నటి వరకు జడ్పీటీసీగా పోటీ చేస్తామంటూ గంపెడాశలు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన రిజర్వేషన్ ప్రకటన చూసిన నాయకులకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది పలు పార్టీల నాయకులకు ఇప్పుడు ఎం చేయలో తెలియక ములుగు జిల్లంతా గందరగోళంగా ఉంది.
స్థానిక ఎన్నికల బరిలో ఉండాలని ఆశాగా ఎదురుచూస్తున్న ప్రతి యువ నాయకులకు అనుకున్నది ఒకటి అయినది ఒకటిగా మారింది. నువ్వానేనా సై అనుకున్న నాయకులకు కన్నాయిగూడెం మండలానికి జెడ్పీసీటీ ఎస్టీ మహిళకు కేటాయించడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి.
ములుగు జిల్లాలో ముఖ్యంగా అధికార కాంగ్రెస్లోని కొందరు యువ నాయకులు జడ్పీటీసీ,ఎంపీటీసీల కాల పరిధి ముగిసిన నాటి నుంచి మంత్రుల కనుసన్నలలో మెదులుతూ జడ్పీటీసీగా నిలబడేందుకు కొంత వర్కవుట్ చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు రిజర్వేషన్లు మారేసరికి అయోమయంలో నాయకులున్నారు .
రిజర్వేషన్లు కేటాయించడంతో నిన్న మొన్నటి వరకు జడ్పీటీసీ పోటీలో ఉంటానంటూ హడావుడి చేసిన నాయకులు ఇక దృష్టి మళ్ళీంచారు ఎంపీటీసీ రిజర్వేషన్ స్థానాలకు అందులో తాము గెలిచే స్థానాల కోసం ఎదురు చూస్తున్నారు.