calender_icon.png 26 August, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి ఆశాల ఆందోళన

26-08-2025 01:39:32 AM

సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న ఆశా కార్యకర్తలు

అదిలాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి) /నిర్మల్/మంచిర్యాల: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్లు ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుండి ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ కు ర్యాలీగా వచ్చారు.

అనంతరం కార్యాలయ ప్రధాన గేట్ ఎదుట  ధర్నా చేపట్టారు. దింతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. నరేందర్ రాథోడ్ ఆశల నిరసన వద్దకు వచ్చి ప్రభుత్వం పరిధిలో ఉన్న సమస్యలను నివేదిస్తామని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం జాయింట్ మీటింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పోటీపడి ఆశాలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. కానీ ఆశాల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదన్నారు.

కనీస వేతనం రూ. 18,000 చెల్లించాలని, ప్రతినెల 5వ తేదీలోపు వేతనాలను ఆశాల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, నాయకులు రేసు సురేందర్ ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నైతం శోభ,  సుజాత, కోశాధికారి సవిత,  తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌లో

వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఆశ వర్కర్లకు వేతనాలు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నిర్మల్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించి కనీస వేతనాన్ని 18,000 చెల్లించాలని ఆశ వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ నువ్వు కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు సురేష్ ఆశా వర్కుల సంఘం నాయకులు సుజాత చంద్రకళ ఇంద్రమాల జ్యోతి రాజమణి తదితరులు పాల్గొన్నారు

మంచిర్యాలలో 

ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ... ప్రభుత్వాలు మారుతున్న ఆశా వర్కర్ల సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదనీ, ధరలు పెరుగుతున్న వాటికీ అనుగుణంగా వేతనాలు మాత్రం ప్రభుత్వాలు పెంచడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలల్లో ఆశాలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు వర్తింపచేయాలన్నారు.

ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి శోభ మాట్లాడుతూ... 20 ఏళ్ళుగా పని చేస్తున్నా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పారితోషకం పేరుతో వెట్టి చాకిరీ చేయించుకుంటుందనీ, పారితోషకాలు తగ్గిస్తామని  చెప్పడం సరైంది కాదన్నారు. తగ్గిస్తే ఊరుకోం. సుప్రీం కోర్ట్ తీర్పు కూడా రాష్ర్ట ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా కనీస వేతనాలు చెల్లించకుండా ఆశ వర్కర్లను శ్రమ దోపిడీకి గురి చేస్తుందన్నారు.

ఏ.ఎన్సి.సి టార్గెట్స్ తో ఏ.ఎన్.ఎం లు.. మెడికల్ ఆఫీసర్ లు ఇబ్బందులు గురిచేస్తున్నారని, సబ్ సెంటర్ డ్యూటీలను తీసివేయాలని, జిల్లా మాత శిశు ఆసుపత్రిలో ఆశ వర్కర్లకు కేటాయించిన ప్రత్యేక గదిని ఆశాలకు ఇవ్వాలని, పీహెచ్సీలలో ఆశాలకు కనీస సౌకర్యాలు కల్పించాలనీ డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి ప్రకాష్, మండలాల కన్వీనర్లు చల్లూరి  దేవదాస్, అంబటి లక్ష్మణ్, పాయిరాల రాములు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సరోజ, ఆశా యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు విజయలక్ష్మి, కవిత, లీలావతి, సువర్ణ, అరుంధతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.