calender_icon.png 26 August, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయకులను పూజిద్దాం

26-08-2025 01:06:45 AM

మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి

తూప్రాన్, (విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దాం అని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి పిలుపునిచ్చారు. తూప్రాన్ పురపాలక సంఘం పరిధిలో వినాయక చవితిని పండుగను పుర స్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు అనగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసానయాలను తగ్గించుకొని మట్టి విగ్రహాల ప్రాధాన్యతను ప్రజలలో చైతన్యాన్ని నెలకొల్పుటకు సోమవారం తూప్రాన్ పురపాలక సంఘ కార్యాలయం నందు  మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేశారు.