calender_icon.png 26 August, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసు ల్యాప్‌టాప్ ఖాళీ!

26-08-2025 01:29:31 AM

  1. విచారణకు సహకరించని ప్రభాకర్‌రావు 
  2. ప్రభుత్వ డేటాను ఫార్మాట్ చేశారు
  3. సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదన
  4. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు
  5. ఇప్పటికే పదిసార్లు హాజరయ్యారు
  6. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు
  7. విచారణ వచ్చేనెల 22కు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితు డు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు దర్యాప్తునకు సహకరించ డం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రభాకర్‌రావు బెయిల్ పిటిషన్‌పై సోమవారం అత్యున్నత న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తునకు సం బంధించి స్టేటస్ రిపోర్టును దాఖలు చేసినట్టు ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సాక్ష్యాధారాలు టాంపరింగ్ చేశారని లూథ్రా కోర్టుకు వివరించారు.

డేటా రికవరీకి కూడా సహకరించడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌టాప్ కూడా అదే స్థితిలో ఉందని, దానిలో ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ ప్రభాకర్‌రావు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజ రవుతూ.. దర్యాప్తునకు సహకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పదిసార్లు విచారణకు హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. తానే స్వయంగా వచ్చి కేసు వివరాలన్నీ చెబుతానని, అప్పటివరకు పాస్ ఓవర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్‌రావును ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం కేసు విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. అంతరవరకు ప్రభాకర్‌రావుకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. నోటీసులు ఇస్తే సిట్ ముందు ప్రభాకర్‌రావు తప్పనిసరిగా హాజరు కావాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. వందలాది మంది నుంచి వాంగ్మూలాలు సేకరించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.