11-01-2026 12:25:22 AM
చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఈ చిత్ర టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, టికెట్ ధరలు పెంచడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, హౌస్ మోషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. కోర్టు పని దినాల్లోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.
దీంతో న్యాయవాది విజయ్ గోపాల్ ఈనెల 19న మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్స్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. జనవరి 12 నుంచి ఏడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.50 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది. హౌస్ మోషన్ విచారణకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో చిరంజీవి సినిమా వ్యాపారం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోనున్నట్టు తెలుస్తోంది.