calender_icon.png 12 July, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన పేదలకు ఇండ్లను మంజూరు చేయాలి

12-07-2025 01:16:08 AM

హుజూర్ నగర్, జూలై 11: పట్టణంలో కోటి ఆశలతో ఎదురు చూస్తున్న అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని ఫణిగిరి గుట్ట ఆదర్శ కాలనీ ఇళ్ళ సాధన కమిటీ అధ్యక్షులు యల్క సోమయ్య ప్రజా ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం సాధన కమిటీ బృందం గుట్ట వద్ద నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించి మాట్లాడారు...పట్టణ పేదల సొంతింటి నెరవేర్చాలనే ఒక గొప్ప సంకల్పంతో రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ రామస్వామి గుట్ట వద్ద 2160 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారని వారి సంకల్పం నెరవేరెందుకు పట్టణంలోని అర్హుల గుర్తించాలని పారదర్శకంగా పంపిణీ ఉండాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి మందడి విశాల సభ్యులు ఉప్పతల్లా గోవింద్ షేక్ రహీం నందిపాటి సైదులు నగరికంటి అంజయ్య షేక్ అక్బర్ చల్లా జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.