03-11-2025 05:45:06 PM
హైదరాబాద్: నగరంలో ఆన్‌లైన్ పెట్టుబడి మోసానికి పాల్పడిన ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మోసగాళ్ళు భారతదేశం అంతటా ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. నిందితులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మడతల రమేష్ రెడ్డి (25), గండి శ్రీను (31), గుర్రపుకొండ శ్రీధర్ (43)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం... నింధితులు వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి, తమ బ్యాంకు ఖాతాలను వ్యవస్థీకృత సైబర్ నేరగాళ్లకు యాక్సెస్ కల్పించారు. వారు పెట్టుబడి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా ప్రతి మోసపూరిత లావాదేవీపై కమిషన్లను కూడా పొందుతున్నారు. రమేష్ సిటీ యూనియన్ బ్యాంక్‌లో ‘రమేశ్ ట్రేడర్స్’ పేరుతో బ్యాంకు ఖాతాను తెరిచి నేరస్థుల నుండి అతను 15 శాతం కమిషన్, అదేవిధంగా, శ్రీను హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఖాతా తెరిచి 10 శాతం కమిషన్,. శ్రీధర్ యస్ బ్యాంక్‌లో ఎస్.ఎస్. టైర్ కలెక్షన్ పేరుతో ఖాతా తెరిచి 20 శాతం కమిషన్ పొందుతున్నట్లు సమాచారం. నిందితులు మూడు వేర్వేరు పెట్టుబడి మోసం కేసులతో ముడిపడి ఉన్నారని, వీటిలో రూ.37.82 లక్షలు, రూ.9.72 లక్షలు, రూ. 11.50 లక్షలు ఉన్నాయి.