calender_icon.png 22 September, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరానికి వాన వణుకు!

22-09-2025 01:19:58 AM

-భాగ్యనగరంపై మరోమారు వరుణుడి ప్రతాపం

-పలు ప్రాంతాలు జలమయం

-కుండపోత వర్షంతో నగరవాసుల అవస్థలు

-లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరిక

హైదరాబాద్ సిటీ బ్యూరో సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): వర్షం భాగ్యనగర వాసుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆదివారం రాత్రి నగరాన్ని వరుణుడు మరోమారు ముంచెత్తాడు. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

కేవలం గంటల వ్యవధిలోనే భారీ వర్షపాతం నమోదు కావడంతో రోడ్లన్నీ నదు లను తలపించాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి 9 గంటల తర్వాత నగరం లోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్.ఆర్. నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, పాతబస్తీతో సహా దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

స్తంభించిన ట్రాఫిక్..  

కుండపోత వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించింది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. మ్యాన్‌హోల్స్ పొంగిపొ ర్లడంతో రోడ్లపై నీరు చేరి వాహనాలు నెమ్మదిగా కదిలాయి. పలు చోట్ల వాహనాలు నీటిలో చిక్కుకుని మొరాయించాయి.

అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ 

భారీ వర్ష సూచన నేపథ్యంలో  జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. డీఆర్‌ఎఫ్  బృందా లను రంగంలోకి దించి, రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బ యటకు రావద్దని సూచించారు. ఏదైనా స హాయం అవసరమైతే జీహెచ్‌ఎంసీ కంట్రో ల్ రూమును సంప్ర దించాలని కోరారు.   

వారం రోజులు వానలే! తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు

రాష్ట్రంలో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నాలుగు రోజులు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం, ఆదిలాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నిర్మల్, మహబూబ్‌బాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశముందని సూచించింది. ఈనెల 23, 27, 28న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది.