15-09-2025 12:28:59 AM
ప్రమాదకరంగా వాహన ప్రయాణాలు..
వెంకటాపురం (నూగూరు), సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : మండల కేంద్రం సమీపంలోని ఆజేడు రహదారిలోని కంకలవాగు వంతెన ప్రమాదకరంగా మారింది. వందనపై పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ వంతెనపై ఐరన్ ప్లేట్లు పైకి తేలి ఉండగా ఇటీవల ఆర్ అండ్ బి అధికారులు వాటిని కట్ చేశారు. గుంతల కారణంగా భారీ ఇసుక లారీలు వెళ్తుంటే ఇజక వాహనదారులు వాటిని దాటి వెళ్లాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది. వంతెన పైనే పదుల సంఖ్యలో భారీ గొంతలు ఉండడంతో ప్రజలు అందరిపై బిక్కు బిక్కుమంటూ ప్రయాణాలు చేస్తున్నారు. ఆర్ అండ్ బాధికారులు ఇకనైనా స్పందించి వంతెనపై గుంతలను పూడ్చి వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.