calender_icon.png 15 September, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలకు నిలయంగా కరీంనగర్

15-09-2025 12:30:10 AM

ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కొత్తపల్లి, సెప్టెంబరు 15 (విజయ క్రాంతి): క్రీడలకు నిలయంగా కరీంనగర్ మారిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సౌత్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలను రేకుర్తి లోని సాయి లక్ష్మి ఫంక్షన్ హాల్ ల ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంగుల హాజరై పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పిల్లలు మొబైల్ లకు దూరంగా ఉండి క్రీడలకు దగ్గర అవడం ద్వారా వారి లో ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిటెన్స్ అద్భుతంగా ఉండి చదువుల్లో చక్కగా రాణిస్తారని అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు ఆర్ ప్రసన్న కృష్ణను అభినందించారు.

ఈ కార్యక్ర మంలో.సి ఎస్ కే ఐ ఇండియా చీఫ్ శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకులు మంతెన కిరణ్, సీనియర్ కరాటే మాస్టర్ వసంత్ కుమార్, గౌరు రాజిరెడ్డి, మొండయ్య, సురభి వేణుగోపాల్, మాడుగుల ప్రవీణ్, పెద్ది సందీప్, పెద్ది అనుదీప్, దేవేందర్,రాకేష్ వినోద్ లుపాల్గొన్నారు.