15-09-2025 12:28:42 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, సెప్టెంబరు 15 (విజయ క్రాంతి): పద్మనగర్ లో ఇటీవల ప్రారంభించిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు. ఆదివారం ఆయన సమీకృత మార్కెట్లో వసతులను పరిశీలిం చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వసతులతో విశాలంగా ఉన్నటువంటి మార్కెట్ ను ప్రజలు సందర్శించి అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ కొనుగోలు కు ఉపయోగించుకోవాలని రోడ్ల పై కొనుగోలు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు వాహనాల పార్కింగ్ తదితర ఇబ్బందులు తలెత్తుతాయని సమీకృత మార్కెట్ లో అమ్మేవాళ్లకు మరియు కొనుగోలు చేసే వారికి పార్కింగ్ తో పాటు విశాలమైన ఫ్లాట్ ఫామ్స్, మరుగు దొడ్లు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.కూరగాయల వ్యాపారులు,నాన్ వెజ్ వ్యాపారులు రోడ్డు మీద కాకుండా సమీకృత మార్కెట్లో అమ్మాలని నరేందర్ రెడ్డిసూచించారు.