calender_icon.png 30 July, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డికి సుప్రీంలో భారీ ఊరట

30-07-2025 01:34:51 AM

  1. గోపన్‌పల్లి వివాదంలో పిటిషన్ డిస్మిస్
  2. పిటిషనర్‌కు కోర్టు ధిక్కారణ నోటీసులు 
  3. తదుపరి విచారణ 11కు వాయిదా

హైదరాబాద్, జూలై29, (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గోపన్‌పల్లి భూ వివాదం కేసులో రేవంత్‌పై నమోదైన పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో గోపన్‌పల్లి భూ వివాదంలో రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆ పిటిషన్‌ను హైకోర్టు క్వాష్ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ పెద్దిరాజుల సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంలో వాదనలు జరిగాయి. కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ పెద్దిరాజుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పిటిషనర్‌తో పాటు ఆయన న్యా యవాదికి కోర్టు ధిక్కారణ నోటీసులను అపెక్స్ కోర్టు జారీ చేసింది. అలాగే పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.

ఈ సందర్భంగా పిటిషన్‌లో హైకోర్టు న్యా యమూర్తిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ పెద్దిరాజుతో పాటు ఆయన తరఫు న్యాయవాది రితేశ్ పాటిల్‌కు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది.

అంతేకాక వచ్చే విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా హాజరు కావాలని,కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై లిఖితపూర్వం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. స్పష్టం చేసింది. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నది. 

గోపన్‌పల్లి కేసు

2016లో గోపన్‌పల్లి గ్రామంలో ఉన్న సొసైటీకి చెందిన భూమిని ఆక్రమించి భూమిని చదునుచేశారని పెద్దిరాజు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రేవంత్‌రెడ్డితోపాటు లక్ష్మయ్య, కొండల్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో కేసు నమోదైంది. అయితే 2020లో తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని హైకోర్టును రేవంత్‌రెడ్డి ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఘటన జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో రేవంత్‌రెడ్డి లేరని, ఆయనపై నమోదైన కేసులో సరైన సాక్ష్యాలు లేకపోవడంతో రేవంత్‌పై నమోదైన కేసును హైకోర్టు క్వాష్ చేసింది.

దీంతో హైకోర్టు తీర్పును సవాల్  చేస్తూ పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ  పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం డిస్మిస్ చేసింది.