29-11-2025 01:01:30 AM
జహీరాబాద్, నవంబరు 28 :జహీరాబాద్ నియోజకవర్గంలోని హగ్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల చీకుర్తి గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు హగ్నూర్ ఎస్త్స్ర దోమ సుజిత్ తెలిపారు.
శుక్రవారం నాడు చీకటి గ్రామంలో గల గొల్ల దత్తు, ఏక్ నాథ్ రెడ్డి కిరాణా షాపులపై దాడులు నిర్వహించి ఇలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నారని సమాచారం మేరకు సోదాలు చేసి అక్రమద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అక్రమంగా వైన్, బీర్ బాటిలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్త్స్ర తెలిపారు. చిత్తపరంగా మద్యం విక్రయించాలి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.