calender_icon.png 31 October, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

4,47,864 ఎకరాల్లో పంట నష్టం

31-10-2025 12:16:56 AM

వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 2,53,033 మంది రైతులు పండిస్తున్న 4,47,864 ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో మొత్తం 12 జిల్లాల్లోని 179 మండలాల పరిధిలో పంటలు దెబ్బతిన్నాయని గురువారం వెల్లడించింది. వరి 2,82,379 ఎకరాలు, పత్తి 1,51,707 ఎకరాలు దెబ్బతిన్నదని తెలిపింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట నష్ట తీవ్రత ఉందని, ఇక్కడ 1,30,200 ఎకరాల్లో పండిస్తున్న పంటలు దెబ్బతిన్నాయని స్పష్టం చేసింది. అలాగే ఉమ్మ డి ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వెల్లడించింది.