calender_icon.png 22 December, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ పాలన.. నాడు భర్త నేడు భార్య

22-12-2025 12:54:03 AM

గోపాలపేట, డిసెంబర్21: తండాలు గ్రామపంచాయతీగా ఏర్పాటు అయిన అనంతరం మొదటి సర్పంచ్ గా భర్త శంకర్ నాయక్ సర్పంచ్ పాలన సాగించాడు. నేడు భార్య ముడావత్ కవిత సర్పంచ్ గా ఎన్నికై నేడు పాలన చేపట్టనున్నారు. అయితే 2019 సంవత్సరంలో శంకర్ నాయక్ ఆముదాల కుంట తండా గ్రామపంచాయతీకి కావలసినంత సేవలు చేస్తూ సిసి రోడ్లు మురుకు కాలువలు కరెంటు పాఠశాలలకు విద్య తండా గిరిజనులకు కావలసిన వసతులన్నీ సర్పంచిగా శంకర్ నాయక్ అందించాడు దీంతో. 2025లో మహిళా రిజర్వేషన్ కావడం పట్ల శంకర్ నాయక్ మళ్ళీ తన భార్యను రంగంలోకి దింపాడు. శంకర్ నాయక్ మా తాండా గిరిజన వారికి మంచి సేవలు అందించాడని మరోసారి అవకాశం ఇద్దామని ప్రజలంతా మూడవ కవితను సర్పంచ్ గా ఎన్నుకున్నారు. నేడు 22న గ్రామపంచాయతీలో మూడవ కవిత సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప విషయమని కాలనీ ప్రజలు అభినందించారు.