22-12-2025 12:55:08 AM
చిట్యాల, డిసెంబర్ 21: రామన్నపేట కోర్టు పరిధిలో మొత్తం 481 కేసులకు పరిష్కారం లభించింది. ఆదివారం రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జ్ జి.సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి డి. సత్తయ్య లు కలిసి కోర్టు హల్ లో జాతీయ లోక్ అధాలత్ ను నిర్వహించారు. రామన్నపేట జ్యుడిషియల్ సంబంధించి రామన్నపేట, వలిగొండ, మోత్కూరు, అడ్డగుడూరు స్టేషన్ పరిధిలో క్రిమినల్ కేసులు 112, ప్రీ లిటికేషన్ కేసులు 02, బ్యాంక్ కేసులు 09, ఇతర పిట్టి కేసులు 358 పరిష్కరించుకున్నారు.
బ్యాంక్ కేసులు ద్వారా 5,95,169/- రూపాయలు అమౌంట్ రికవరీ చేయబడినట్లు తెలిపారు. అనంతరం జడ్జీ మాట్లాడుతూ క్షణిక ఆవేశాలతో అప్పటి పరిస్థితులలో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బులు, సమయం వృధా చేసుకోవడం బదులు రాజీ మార్గమే రాజమార్గంగా కోర్టు పరిధిలో నిర్వహించే లోక్ ఆధాలత్ వినియోగించుకొని సమస్యలు పరిష్కరించుకోవడానికి కక్షిదారులు ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ లు, పలు మండలాల ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్లు, వివిధ పోలీస్ స్టేషన్ ల సిబ్బంది, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు గణేష్, శ్రీశైలం పాల్గొన్నారు.