26-08-2025 01:25:23 AM
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి) : దేశవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. అంతర్జాతీయ కంపెనీలకు గమ్యస్థానంగా మారుతున్నది. నగరంలో నైపుణ్యమున్న మానవ వనరులు, సౌకర్యాలు అందుబాటులో ఉండ టంతో ఇప్పటికే అనేక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఇక్కడ నెలకొన్నాయి.
దేశవాప్యంగా ఉన్న జీసీసీల జాబితాలో రెండు స్థానంలో నిలిచింది. జీసీసీల ఏర్పాటులో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో నిలబెట్టడంలో హైదరాబాద్ కీలక మైంది. ఫార్చ్యూన్ 500 సంస్థలు, టెక్ యూనికార్న్‌లు, పరిశోధన, ఆవిష్కరణలకు సంబంధించిన కంపెనీలను ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది.
21 శాతం హైదరాబాద్‌లోనే..
ప్రపంచవ్యాప్తంగా 3200 జీసీసీలు ఉం డగా, కేవలం భారతదేశంలోనే 1700 జీసీసీలు ఉండటం విశేషం. అయితే ఇది మొత్తం జీసీసీల్లో 53 శాతంగా ఉన్నది. భారతదేశంలోని జీసీసీల ఏర్పాటులో హైదరాబాద్ ప్రధాన భాగస్వామిగా నిలిచింది. భారతదేశంలోని మొత్తం జీసీసీల్లో సుమా రు 300 వరకు హైదరాబాద్‌లోనే కార్యకలాపాలు ప్రారంభించడం విశేషం. దేశంలోని జీసీసీల్లో 21 శాతం జీసీసీలను ఆకర్షించి జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
అ యితే జీసీసీలను ఆకర్షించడంలో ఫార్మా, ఐ టీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్, ఇన్స్యూరె న్స్, ఏరోస్పేస్ రంగాలు కీలక పాత్ర పోషించాయి. ఈ రంగాల అభివృద్ధికి హైదరాబాద్ నగరంలో అద్భుత అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, ప్రభుత్వ విధానాలను వేగంగా అమలుచేయడం, అనుకూలమైన పారిశ్రామిక విధానం వంటి అంశాలు హైదరాబాద్ నగరానికి ఉన్న ప్ర ధానమైన బలంగా నిలుస్తున్నాయి.
అత్యంత వేగంగా అభివృద్ధి..
హైదరాబాద్ నగరం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందు వరుసలో ఉన్నది. స్థానికం గా లభించే నైపుణ్య వనరులు, మౌలిక సదుపాయాల కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీలైన అమెజాన్, బేయర్, సాండోజ్, రోచె, బ్లాక్‌బెరీ, ఆస్ట్రాజెనికా వంటివి ఇక్కడ నుంచే తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. దీంతోపాటు నగరంలో బెంగళూరు కంటే దాదాపు 20 శాతం కంటే తక్కు వ ధరకే కార్యాలయాల స్థలాలు లభిస్తున్నా యి. ప్రపంచస్థాయి కంపెనీల ఏర్పాటు ను అందిపుచ్చుకోవడంలో ఇది కీలకంగా నిలుస్తుంది.
టీఎస్ టీఘుఊహబ్ ఇం క్యుబేటర్ వంటి వివిధ కార్యక్రమాలు, వేగవంతమైన మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి పెట్టడంతో హైదరాబాద్‌ను టెక్, బ యోటెక్ జీసీసీలకు సరైన కేంద్రంగా మారుస్తుంది. ముఖ్యంగా లైఫ్ సెన్సైస్, బీఎఫ్‌ఎ స్‌ఐ, ఇతర అభివృద్ధి చెందుతున్న టెక్ రంగాల్లో నైపుణ్యం ఉన్న నిపుణులను ఆకర్షించడంలో అద్భుత ప్రగతి సాధిస్తుంది. దీంతో వందలాది అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రా రంభించేందుకు మొగ్గు చూపుతున్నారు. తద్వారా ప్రపంచ జీసీసీ ఏర్పాటు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలుస్తుంది.