13-12-2025 04:26:17 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్ఈసీ నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆయా గ్రామాలకు కేటాయించిన వాహనాల్లో అధికారులు, సిబ్బంది సామగ్రితో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసాచారి, డీపీఓ షరీఫుద్దిన్, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.