13-12-2025 04:23:22 PM
మంచికి నిదర్శనం మఠంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ బాబు..
మఠంపల్లి: సూర్యపేట జిల్లా మఠంపల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ బాబు పెద్ద మనిషితో మాట ముచ్చట, పోలీసులు ఉన్నది, డ్యూటీలు చేసేది ప్రజల మాన, ప్రాణ, సంరక్షణకే ఇది ముమ్మాటికీ మనందరికీ తెల్సిందే కానీ.. ప్రజల మనసు గెలుచుకునే పోలీసులు అతికొద్దిమంది మాత్రమే ఇలాంటి అతికొద్ది మంది పోలీసు అధికారుల్లో మన మఠంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ బాబు ఒకరు. పేద-ధనిక అనే తేడా లేకుండా ప్రతీ మనిషితో అత్యంత మర్యాద పూర్వకంగా మసలుకోవడం ఎస్సై ప్రత్యేకత. ఎంతోమంది మన మఠంపల్లి పోలీసు స్టేషన్ కు వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ లు ఉన్నారు కానీ ఇలా ప్రజల మనసు గెలుచుకున్న ఏకైక సబ్ ఇన్స్పెక్టర్. తానొక పోలీసు అధికారిని అనే గర్వం ఎప్పుడు ప్రదర్శించకుండా తానొక ప్రజల పోలీసు గానే ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నటువంటి వైనమే ఈయన్నీ ప్రజల పోలీసుగా కొనియాడుతున్నారు మండల ప్రజలు.