calender_icon.png 13 December, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి

13-12-2025 04:18:06 PM

హమీల పేరుతో మోసం చేస్తున్న కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కన్నాయిగూడెం మండల ప్రజలు

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య

కన్నాయిగూడెం (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పరిపాలన పట్ల అవగాహన లేకపోవడం ద్వారా రాష్ట్రం కుంటుపడుతుందని బీఆర్ఎస్ పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య ఆరోపించారు. గ్రామ పంచాయతీ మూడో విడత సర్పంచి ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇల్లు తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముప్పనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ సర్పంచు అభ్యర్థి తిప్పనపల్లి లక్ష్మయ్యను ప్రజలు ఏకగ్రీవం చేసుకున్నారు.

ఇదే తరహాలో మిగతా గ్రామాలు ఏటూరు, చింతగూడెం, బుట్టాయిగూడెం, గూర్రేవుల రాజన్నపేట, లక్ష్మీపురం, తుపాకులగూడెం, ఐలాపూర్, సర్వాయి కంతనపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య మాట్లాడుతూ హమీల పేరుతో మోసం చేస్తున్న కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్పాలని కన్నాయిగూడెం మండలంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇక్కడ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 6 గ్యారంటీలు 420 హామీలను ఇవ్వకుండా నమ్మించి ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల రాష్ట్ర ప్రజలు, పల్లెలు ఆగమవుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ 10ఏళ్ల పరిపాలనలో గ్రామాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయలేదన్నారు. అలాగే వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి 24 నెలలు గడిచిన ఇవ్వలేదనీ పేర్కొన్నారు. 24 నెలల్లో వృద్ధులకు ఇవ్వాల్సిన 48 వేల రూపాయలు ప్రతి ఒక్క వృద్ధునికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినంక ఓట్లు అడగాలనీ డిమాండ్ చేశారు. గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచుల తరపున ఉంటూ గ్రామాల్లో ఉన్న సమస్యల కోసం పాటుపడతామని ఈ సందర్భంగా  తెలిపారు. జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో, వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పెట్టాలని ఓటర్లకు సూచించారు.