14 April, 2026 | 12:41 AM

కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు

28-11-2025 12:00 AM

అడ్డుకునేందుకు స్థానికుల యత్నం 

మేడ్చల్, నవంబర్ 27 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలోని నల్లచెరువు సమీపంలోని ప్రకాష్ నగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ సందర్భంగా స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమకు నోటీసులు ఇవ్వలేదని, పునరావాసం కల్పించ లేదని ఇళ్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.