calender_icon.png 21 September, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిభట్ల మున్సిపాలిటీలో హైడ్రా పర్యటన

21-09-2025 12:00:00 AM

శ్లోక కన్వెన్షన్ కబ్జా చేసిన గిఫ్ట్ డీడ్ స్థలంపై ఆరా

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 20: ఆదిభట్ల మున్సిపల్ పరిధి కొంగరకలాన్ లోని శ్లోక కన్వెన్షన్ హాల్ ను శనివారం హైడ్రా అధికారులు పరిశీలించారు. ఆదిభట్ల మున్సిపాలి టీకి సంబంధించిన కోట్లు విలువ చేసే ‘గిఫ్ట్ డీడ్ స్థలం‘ ఆక్రమించి, అందులో అక్రమంగా సీసీ రోడ్డు, ప్రహరీ గోడ నిర్మాణం జరిగిందని ఇటీవల హైడ్రా కు ఫిర్యాదు రావడంతో హైడ్రా ఏసిపి తో పాటు ఇన్స్పెక్టర్ తిరుమలేశ్ కలిసి సందర్శించారు.

అయితే గతంలో ఈ స్థలం కబ్జా అంశంపై స్థానికులు ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్, హెచ్‌ఎండిఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు లేకపోవడంతో, హైడ్రాను ఆశ్రయించారు. దీనిపై విజయక్రాంతి పత్రికలో వరుస కథనాలు సైతం ప్రచురితం అయ్యాయి. ఎట్టకేలకు హైడ్రా అధికారులు స్పందించి  కబ్జా స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. గిఫ్ట్ డీడ్ స్థలం కబ్జాపై చేసిన ఫిర్యాదుదారుడు, ప్రతివాదుల నుండి సంబంధిత పత్రాలను అందజేయాల్సిందిగా ఆదేశించామని, అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని వారు పేర్కొన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని శ్రీమిత్ర వెంచర్ లో పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి.

దీనిపై కూడా హైడ్రా అధికారు లు దృష్టి సారించాలని, ప్రజా అవసరాలకోసం కేటాయించిన స్థలాలను కాపాడాల్సిం దిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇంతకు కబ్జాకు గురైన ఆదిభట్ల మున్సిపాలిటీ గిఫ్ట్ డీడ్ స్థలం కాపాడడంలో హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటారా, లేదా అనేదానిపై స్పష్టత రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.