calender_icon.png 21 September, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ పై నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం...

20-09-2025 11:47:36 PM

పెద్దపల్లి జిల్లా టీఎన్జిఓ అధ్యక్షుడు బొంకూరి శంకర్

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా  కలెక్టర్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని జిల్లా టీఎన్జిఓ చైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు. రామగుండంలోని ఒక ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు వారి సొసైటీకి 10 గుంటల భూమి కేటాయించడానికి జిల్లా సంక్షేమ అధికారి ద్వారా కలెక్టర్ డబ్బులు అడుగుతున్నారని ఆరోపించడాన్ని టీజ్యాక్ చైర్మన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎల్లప్పుడు ప్రజా సమస్యలు విద్యా ఉద్యోగాలు యువత భవిష్యత్తు వృద్ధుల సంక్షేమం వంటి అనేక అంశాలపై కృషి చేస్తున్నారని, కలెక్టర్ పై అసత్య ప్రచారం చేయడం ఉద్యోగుల మనోధైర్యం దెబ్బ  తీయడమేనన్నారు.

కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ పాఠశాల, సంక్షేమ వసతి గృహాలు కేజీబీవీలలో విద్యార్థులకు తగిన వత్తులు రూపకల్పనకై అన్ని విధాల నిధులు విడుదల చేస్తూ నాణ్యమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని, సీనియర్ సిటిజన్ జాకిట్ ప్రకారం కొడుకులు వారి వృద్ధులను తల్లిదండ్రులను సంక్షేమం చూడనట్లయితే వారిపై కఠినంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకుంటూ భరోసా కల్పిస్తున్నారని, ప్రజలకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాల అమలుకు కలెక్టర్ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిర్విరామంగా శ్రమిస్తున్న కలెక్టర్ పై ఆరోపణలు చేయడం పనిచేసే ఉద్యోగులు మన భావాలకు తీవ్రమైన భంగం కలుగుతుందని, దీనిని జేఏసి పక్షాన ఖండిస్తున్నామని అన్నారు.