calender_icon.png 25 August, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలకృష్ణ

25-08-2025 12:44:00 AM

టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు చేరింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా నిలిచారు. ఆయన సినీ కెరీర్‌కు 50 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ హీరోగా కొనసాగుతుండటం విశేషం. ఇదే బాలకృష్ణను తాజా అవార్డుకు ఎంపిక చేసింది.

ఈ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈవో సంతోష్ శుక్లా జారీ చేసిన అధికారిక అభినందన పత్రంలో ‘బాలకృష్ణ ఐదు దశాబ్దాల సినిమా సేవలను మిలియన్ల మందికి స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఈ నెల 30న బాలకృష్ణను సత్కరించనున్నారు.