22-07-2025 12:28:52 AM
తోట శ్రీకాంత్‌కుమార్ రచనాదర్శకత్వంలో పప్పు బాలాజీరెడ్డి నిర్మాతగా మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘థాంక్యూ డియర్’. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోష ముఖ్యపాత్రల్లో నటి స్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్‌ను డైరెక్టర్ వీవీ వినాయక్ లాంచ్ చేశారు. కాగా, సోమవారం ఈ చిత్రంలోని తొలిగీతం ‘చిక్కక చిక్కిన గుమ్మ’ను స్టార్ హీరో మంచు మనోజ్ విడుదల చేశారు.
ఈ పాటను నిర్మాత బాలాజీరెడ్డి రాయగా శ్రీచరణ్ ఆలపించారు. ఈ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ.. “థాంక్యూ డియర్’ ఫస్ట్ సింగిల్ వినసొంపుగా సాగుతోంది. ఆకట్టుకునేలా ఈ పాటను తీర్చిదిద్దారు’ అన్నారు. కార్యక్రమంలో హీరో ధనుష్ రఘుముద్రి, నిర్మాత బాలాజీరెడ్డి, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, లైన్ ప్రొడ్యూసర్ పునీత్ పాల్గొన్నారు.