calender_icon.png 28 November, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజినిలో నటించి పెద్ద తప్పు చేశా!

26-11-2025 12:14:44 AM

వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది నయనతార. ప్రస్తుతం మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌గా మారింది. తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన ‘గజిని’ సినిమా లో నయనతార ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయన్ ఆ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. “నా కెరీర్‌లో చేసిన అతి పెద్ద తప్పేదైనా ఉందంటే అది గజిని సినిమా ఒప్పుకోవడమే. కథ చెప్పినప్పుడు నా పాత్ర చాలా నచ్చిం, రెండో హీరోయిన్‌గా అయినా ఒప్పుకున్నా.

షూటింగ్ చేసేటప్పుడు నా పాత్ర ఎక్కువ నిడివితోనే ఉంది. తీరా ఫైనల్ అవుట్ ఫుట్‌లో చాలా ఎడిట్ చేశారు. నన్ను గ్లామర్ డాళ్‌గానే చూపించారు” అన్న ది. నయన్ ప్రస్తుతం చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’లో కథానాయిగా నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతికి రానుంది. బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న మరో సినిమానూ ఓకే చేసింది. ఇటీవలే ఈ సినిమా నుంచి నయన్ లుక్ విడుదల చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.