calender_icon.png 28 November, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పట్నుంచి థియేటర్‌కు వెళ్లడమే ఆపేశా..

26-11-2025 12:13:36 AM

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు పీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్త్తోంది. ఈ సందర్భంగా ఉపేంద్ర చెప్పిన ఈ సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే.. 

-ఈ కథను ఒక ప్రేక్షకుడిగా విన్నాను. స్టొరీ చెప్పగానే ఫ్యాన్స్‌కు కనెక్ట్ అయిపోయాను. ఇందులో చాలా అద్భుతమైన ఎమోషన్ ఉంది. అందరి జీవితంలో ఇలాంటి ఎమోషన్ ఉంటుంది. అది నాకు ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయ్యింది. అభిమానుల ప్రేమకు అసలు లాజిక్ ఉండదు. ఎందుకు ఇంతగా ప్రేమిస్తారు..? దానికి మనం అర్హులమేనా..? అనిపిపిస్తుం టుంది కదా! అందుకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. 

- ఫ్యాన్స్‌తో మెమోరబుల్‌గా ఉండే మూమెంట్స్ నాకు -చాలా ఉన్నాయి.. నేను నా పుట్టినరోజు (సెప్టెంబర్ 18)ను ఫ్యాన్స్‌డేగా ప్రకటించాను. ఆ రోజంతా వాళ్లదే. ఎంతో మంది అభిమానులు వచ్చి లక్షల్లో ఖర్చు పెట్టి పెద్ద వేడుకలు చేస్తారు. పెద్ద కటౌట్లు పెడతారు. సింహాసనం మీద కూర్చోబెడతారు. పూలతో అభిషేకం చేస్తారు. నేను ఎంత వద్దని చెబుతున్నా.. ఈరోజు మాదే అంటారు. వాళ్ల అభిమానానికి అవధుల్లేవు. 

- ఇందులో నేను చేసిన ‘సూపర్ స్టార్ సూర్య’ పాత్ర -ఒక స్టార్ జీవితంలాగా ఉంటుంది. ఫ్యాన్స్ క్రేజ్, అప్‌అండ్‌డౌన్స్ అన్నీ ఉంటాయి. మానవీయ బంధాల మధ్య ఉండే భావోద్వేగాలు, ప్రేమ, ధనిక పేదల మధ్య ఉండే ఒక సంఘర్షణ వంటి అంశాలన్నీ కమర్షియల్ కోణంలో చేసిన సినిమా ఇది. అవన్నీ సినిమాకు అద్భుతంగా కలిసి వచ్చాయి. ఒక స్టార్‌కు, అభిమానికి మధ్య ఉండే భావోద్వేగభరితమైన అనుబంధాన్ని దర్శకుడు చాలా అద్భుతంగా చెప్పారు. అది చాలా కొత్తగా అనిపిస్తుంది. 

-మైత్రి రవి, డైరెక్టర్ మహేశ్‌బాబు వచ్చి ఈ కథ చెప్పారు. వాళ్లు చెప్తున్నప్పుడే చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యాను. ఒక్కో డైలాగ్ మనసును హత్తుకునేలాగా ఉంది. ప్రతి సీన్‌కు మధ్య ఉండే కనెక్షన్ అద్భుతం. -ఇలాంటి మంచి సినిమా చేసినందుకు మైత్రి మూవీ మేకర్స్‌కు థాంక్యూ చెప్పాలి. ఇందులో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అభిమానులకు ఏదైనా చెప్పాలనే ఒక కోరిక ఉండేది. ఆ అవకాశం ఈ సినిమాతో దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. 

- ఫస్ట్‌డే ఫస్ట్‌షో ఎక్స్‌పీరియన్స్ గురించి ఈ సందర్భంగా మీతో పంచుకోవాలి.. -నేను చేసిన ‘ఏ’ సినిమా తొలిరోజు థియేటర్‌కు వెళ్లాను. ప్రేక్షకులందరూ సినిమా చూడకుండా నా కోసం బయటికి వచ్చేశారు. అసలు అది విభిన్నమైన స్క్రీన్‌ప్లే ఉన్న సినిమా. ప్రేక్షకులు సినిమా మిస్ అవుతారనే ఫీలింగ్ కలిగింది. అప్పటినుంచి థియేటర్‌కు వెళ్లడం ఆపేశాను. 

-చిన్నప్పుడు సినిమా చూడటం పెద్ద విషయం. అదొక గొప్ప అనుభూతి. ఏడాదికి ఒకసారి వెళ్లడమే గ్రేట్. నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత రజనీకాంత్, చిరంజీవి సినిమాలను ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూసేవాడిని. నాగార్జున శివ సినిమా కూడా ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూశాను.

-రామ్ ఎక్స్‌ట్రార్డినరీ ఎనర్జిటిక్ పెర్ఫార్మర్. ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఆయన యాక్షన్ చూస్తే గూస్‌బంప్స్ వస్తాయి.  ఒక స్టార్ అయి ఉండి అలా నటించడం అంత ఈజీ కాదు.  అభిమానిలో ఉండే అమాయకత్వం, ఎనర్జీ, మాస్.. అన్నీ కనిపించాయి. స్టార్‌కు, అభిమానికి మధ్య ఉండే కనెక్షన్ డివైన్. అలాంటి భావోద్వేగాలను పండించిన తీరు అద్భుతం.

- ఈ సినిమాలో భాగ్యశ్రీతో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. రామ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్క్ అయింది. నేటివిటీని అద్భుతంగా తీసుకువచ్చారు.. డైరెక్టర్‌కు హ్యాట్సాఫ్.  

- కొన్ని సినిమాలకు అన్నీ చక్కగా కుదురుతాయి. ఈ సినిమా కూడా మంచి మ్యూజిక్, ఫోటోగ్రఫీ, మంచి ఆర్టిస్టులు, ప్రొడక్షన్ హౌస్ మంచి వర్క్ ఇచ్చారు.

- ‘కూలీ’లో రజినీకాంత్‌తో కలిసి నటించడం -నా జీవితంలో ఒక ఎక్స్‌ట్రార్డినరీ మూమెంట్. రజినీకాంత్‌కు నేనొక భక్తుడిని. నేను ఆయన్ని ఒక డిక్షనరీలాగా ఫాలో అవుతాను. ఆయన అంటే నాకు అంత కనెక్షన్. 

-నా దర్శకత్వంలో చిరంజీవితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. అదొక పెద్ద డ్రీమ్. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాను. ఇక డైరెక్షన్‌లో కొత్త సినిమా గురించి -కొన్ని కథల మీద వర్క్ జరుగుతోంది. మంచిది ఫైనల్ అయితే ప్రకటిస్తాను. 

-డైరెక్టర్‌గా, యాక్టర్‌గా ఇంకా చేయదలుచుకున్న డ్రీమ్ క్యారెక్టర్స్, కథలు చేయాలనే ఆకలి ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ఏదో కొత్తగా చేయాలి, మంచి కథ చెప్పాలి అనే తపన ఎప్పుడూ ఉంటుంది.