calender_icon.png 28 November, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌బీకే111కు కొబ్బరికాయ కొట్టేశారు

27-11-2025 12:00:00 AM

బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని మరో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఈ ఇద్దరి కొలాబరేషన్‌లో హిస్టారికల్ ఎపిక్‌గా రూపొందుతున్న సినిమా ఇది. ప్రస్తుతం ‘ఎన్‌బీకే111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ ప్రాజెక్టు బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, దర్శకులు బీ గోపాల్, బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చిబాబు, తేజస్విని నందమూరి, స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు. గోపిచంద్ మలినేని తొలిసారి చారిత్రక అంశాలతో రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమా స్పెషల్ పోస్టర్‌లో బాలకృష్ణ ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో యాంకర్ పట్టుకుని అఖండమైన రాజసంతో కనిపించారు. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.