calender_icon.png 20 October, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశ వసంతాల అందం!

19-10-2025 12:36:16 AM

అనుపమ అంటే సాటిలేనిది, అద్వితీయమైనది అని అర్థం. మల యాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ను సార్థక నామధేయురాలు అనకుండా ఉండలేమంటే నమ్మండి! ఎందుకంటే, పదేళ్ల తర్వాత కూడా తెరపై మెరిసేవారు అతితక్కువ మంది భామల్లో అనుపమ ఒకరు. మలయాళ ‘ప్రేమమ్’ విడుదలై పదేళ్లు పూర్తవుతోంది. అనుపమ  ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ పదేళ్లలో వరుసగా సినిమాలు చేస్తున్న అనుపమ ఇప్పటికీ కెరీర్‌లో బిజీబిజీగా దూసుకె ళ్తోంది.

ఈ ఏడాదిలో మొత్తం ఆరు సినిమాలతో జోరు సాగిస్తున్న అనుపమ సినిమాలు నాలుగు ఇప్పటికే విడుదలయ్యాయి. ‘డ్రాగన్’ సినిమాతో ఈ ఏడాదిని శుభారంభం చేసిన అనుపమకు ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. జానకి వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, పరదా చిత్రాలతో ప్రశంసలందు కుంది. ఇటీవల ‘కిష్కింధపురి’తో అలరించింది. మరో రెండు సినిమాలూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మలయాళ చిత్రం ‘ది పెట్ డిటెక్టివ్’ సినిమాలోనూ అనుపమ నటనకు కచ్చితంగా మంచి మార్కులు పడుతాయట.

ఇక ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’ చిత్రంలో అనుపమనే హీరోయిన్. పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 24న విడుదల కానుంది. ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాలు, మహిళా ప్రాధాన్య చిత్రాలతో రావడం అనుపమకు కలిసివచ్చినట్టయ్యింది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ‘లాక్‌డౌన్’ సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతోంది.