26-11-2025 12:10:50 AM
శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘పరాశక్తి’. సుధా కొం గర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ మూవీలో రవిమోహన్, అథర్వ, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషిస్తున్నా రు. ఇది శ్రీలీలకు తొలి తమి ళ చిత్రం. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తా జాగా ‘రత్నమాల’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘రత్నమాలా రత్నమాలా.. లేనిపోని అలకలే.. ఉలకవే పలకవే.. నీ మోము అందాలు చెడిపే అలకలే మానుకోవే.. నను వీడి నువు అలా పోరాదే..’ అంటూ సాగుతోందీ గీతం. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం సమకూర్చిన ఈ గీతానికి భాస్కర భట్ల సాహిత్యం అందించారు. ఎల్వీ రేవంత్, దీ, సీన్ రోల్డన్ పాడారు. ఈ పాటలో శివ కార్తికేయన్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.